Saturday, December 21, 2024

స్విచ్ వేస్తే వచ్చే కరెంటు కావాలా, కర్ణాటక కరెంట్ కావాలా?

- Advertisement -
- Advertisement -

స్విచ్ వేస్తే వచ్చే కరెంటు కావాలా? కర్ణాటక తరహా కరెంటు కావాలా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కర్ణాటకలో రైతులు పడరాని కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. జహీరాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధును బంద్ చేశారని చెప్పారు. కాగా, తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకూ రైతు బంధు కింద 72 వేల కోట్ల రూపాయలు అందజేసిందన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జి గాలి అనిల్ కుమార్ ను హరీశ్ బుధవారం ఉదయం కలిసి, బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఇందుకు అనిల్ సమ్మతించారు. నర్సాపూర్ లో జరిగే సభలో ఆయన లాంఛనంగా బీఆర్ఎస్ లో చేరునున్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసినందుకే తాను రాజీనామా చేశానని అనిల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News