చెన్నై: చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచిన పది బిల్లులను తమిళనాడు గవర్నర్ తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని సీఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి ఆయనకు పంపనున్నట్టు స్పీకర్ ఎం అప్పావు తెలిపారు. అందుకే శనివారం అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీలో ఆమోదించి పంపిన 12 బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్ రవి చాలా కాలంగా పెండింగ్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు అసెంబ్లీలో తీర్మానించిన బిల్లులను గవర్నర్ క్లియర్ చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని మండిపడింది. ఈ పరిణామాలతో పెండింగ్‌లో ఉన్న 12 బిల్లుల్లో పది బిల్లులను గవర్నర్ తిప్పి పంపారు.