Sunday, December 22, 2024

‘ఉద్యోగ నియామకాల్లో లంచాలు’… కొడుకుపై ఆరోపణలు కొట్టివేసిన సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఉద్యోగ నియామకాల్లో లంచాలు(క్యాష్ ఫర్ పోస్టింగ్) స్కామ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కీలక పాత్ర ధారి అంటూ వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టి పారేశారు. యతీంద్రకు సంబంధించిన వివాదాస్పద వీడియో వైరల్ కావడం ఆరోపణలకు దారి తీసింది. తాను పంపిన జాబితాకు చెందిన వ్యక్తుల గురించి పనిచేయాలని తన తండ్రి, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను యతీంద్ర ఫోన్‌లో ఆదేశిస్తున్నట్టు ఆ వీడియో దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఓ మీటింగ్‌లో జనం మధ్య ఉన్న సమయం లోనే ఆ వీడియో రికార్డు జరిగింది.

ఈ వీడియోను సాక్షంగా పేర్కొంటూ మాజీ సిఎం హెచ్‌డీ కుమారస్వామి రాష్ట్రంలో క్యాష్ ఫర్ పోస్టింగ్ స్కామ్ నడుస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కొట్టిపారేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సిఎస్‌ఆర్) నిధుల గురించి ఈ సంభాషణ తప్ప బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) ఆరోపించినట్టు “ఉద్యోగ నియామకాల లంచాల” గురించి కాదని వివరించారు. సిఎస్‌ఆర్ నిధుల లబ్ధి పొందనున్న స్కూళ్ల జాబితాపై యతీంద్ర తనతో చర్చిస్తున్నారని సిద్ధరామయ్య చెప్పారు. ఈ ఫోన్ సంభాషణను కుమారస్వామి వక్రీకరిస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News