- Advertisement -
మాడ్రిడ్ : స్పెయిన్ తాత్కాలిక సోషలిస్టు ప్రధాని పెడ్రో సాంచెజ్ మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ దిగువ సభలో మొత్తం 350 మంది చట్టసభ సభ్యుల్లో 179 మంది సాంచెజ్‌కే మద్దతు పలికారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ సభ్యుల మద్దతు లభించింది. మితవాద పక్ష సభ్యులు మాత్రమే వ్యతిరేకించారు. అత్యంత వివాదాస్పదమైన కేటలాన్ వేర్పాటు వాదులకు క్షమాభిక్ష ఒప్పందంపై రెండు రోజుల పాటు చర్చ జరిగిన తరువాత సాంచెజ్ ఎన్నికకు మార్గం సుగమం అయింది.
- Advertisement -