Sunday, November 24, 2024

తీవ్ర వాయుగుండం.. విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఈ నెల 18నాటికి వాయుగుండం బంగ్లాదేశ్‌లోని ఖేపుపారమొంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మరో వైపున క్రింది స్థాయిలో గాలులు ఉత్తర ,ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. రాష్ట్రంలో మరో 48గంటల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News