Sunday, December 22, 2024

వరుడికి షాక్ ఇచ్చిన వధువు

- Advertisement -
- Advertisement -

కొత్తకోట: పెళ్లి సమయం దగ్గర పడటంతో ఇరు కుటుంబాల సభ్యులు ఏర్పాట్లతో బిజీ బిజీగా ఉన్నారు. పెళ్లి కొచ్చిన చుట్టాలతో ఆలయంలో ఏర్పాటు చేసిన పెళ్లి మండపంలో పండగ వాతావరణం నెలకొంది. కనుల పండుగగా జరిగే పెళ్లిని చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఇంతలో సినిమా తరహాలో పెళ్లి కొడుకుకు పెళ్లికూతురు ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటకు సంబంధించిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రానికి చెందిన ఓ యువకుడితో వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన

ఓ యువతికి గురువారం ఉదయం 7గంటలకు కానాయపల్లి గ్రామ సమీపంలో గల శ్రీదత్త కోటిలింగేశ్వర్ ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. తాళి కట్టేందుకు ఒక్క నిమిషం ముందు ఈ పెళ్లి నాకు వద్దంటూ వధువు షాక్‌చ్చింది. బంధువులు ఎందుకు పెళ్లి వద్దని అంటున్నావని వధువును నిలదీయడంతో వరుడుకి నత్తితో పాటు చదవు తక్కువగా ఉందని అందుకు వధువు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన వారు పెళ్లి చూడకుండానే వెనుదిరిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News