ఉమెన్-ఫస్ట్ డేటింగ్ యాప్ బంబుల్, నేడు 2024కి సంబంధించిన వార్షిక డేటింగ్ ట్రెండ్‌లను విడుదల చేసింది. ప్రజాదరణ పొందిన ఈ డేటింగ్ యాప్ డేటింగ్, రాబోయే ఏడాదిలో సంబంధాలను నిర్వచించే పోకడలను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా 25,000 కన్నా ఎక్కువ సింగిల్స్ నుంచి బంబుల్ అభిప్రాయాలను సేకరించింది. బంబుల్ తన Bumble’s 2023 trendsలో వాండర్‌లవ్‌తో విదేశాలలో ప్రేమను నావిగేట్ చేయడం, ఓపెన్-కాస్టింగ్‌తో మీ తీరుకు మించి డేటింగ్ చేయడం, మన భాగస్వాములతో, మన పని జీవితాలు, మన ఆర్థిక విషయాలతో కొత్త సరిహద్దులను ఏర్పరచుకోవడంపై దృష్టి సారించాయి. ముందుచూపుతో, 2024 డేటింగ్‌లో ‘‘సెల్ఫ్’’ సంవత్సరంగా సెట్ చేశారు. ఎక్కువ మంది వ్యక్తులతో వారు విలువైన అంశాలను ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలని భావిస్తున్నారు.
పరిపూర్ణత కోసం సింగిల్స్ నిరంతరం ప్రయత్నించడానికి దూరంగా ఉండడం, కాలం చెల్లిన సమయ పాలనలను విస్మరించడం, ‘ఉద్యోగాన్ని’ సవాలు చేయడం, భావోద్వేగాల దుర్బలత్వం, స్వీయ అంగీకారం, భాగస్వామ్య ప్రాధాన్యతలపై ఎక్కువ విలువను ఉంచడాన్ని వంటివి ఈ వ్యక్తిగత ప్రాధాన్యత దృష్టి సారించింది. మనం 2024 ఏడాదికి వెళుతున్నప్పుడు, ‘స్వీయ సంవత్సరం’ కోసం ఆశావాదం, స్పష్టత ఉందని బంబుల్ పరిశోధనలో తేలింది. సమీక్షకు స్పందించిన భారతీయ మహిళల్లో సగానికి పైగా (59%) కొత్త ఏడాదిలో తమ శృంగార జీవితాంల నుంచి తమకు ఏమి కావాలో స్పష్టమైన దృక్పథంతో వెళ్తున్నారని తేటతెల్లం చేసింది.
బంబుల్ డేటింగ్ ట్రెండ్ అంచనాలు:
1. వాల్-కోర్ డేటింగ్: నేడు సింగిల్స్ భాగస్వామ్య ప్రాధాన్యతల కోసం వెతుకుతున్నారు. తమ భాగస్వాములు సామాజిక కారణాలతో మాత్రమే కాకుండా చురుకుగా పాల్గొనాలని ఆశిస్తున్నారు. వాల్-కోర్ అనేది వారికి ముఖ్యమైన సమస్యలపై ఎంగేజ్‌మెంట్‌కు విలువ ఇచ్చే వ్యక్తుల పెరుగుదలను సూచిస్తుంది. బంబుల్‌లోని 4లో 1 (25%) వ్యక్తికి వారి భాగస్వామి రాజకీయాలు, సామాజిక కారణాలతో చురుకుగా పాల్గొనడం కీలకంగా ఉండగా, వాస్తవానికి ఇది వారిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. వాస్తవానికి, 41% మంది భారతీయులు తమకు కాబోయే భాగస్వామి రాజకీయాలలో పాల్గొనడం, ఓటు వేయడం తమకు ముఖ్యమని చెప్పారు. డేటింగ్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా 3 (33%) మంది మహిళల్లో 1 మహిళ భిన్నమైన రాజకీయ దృక్కోణాలు ఉన్న వారి పట్ల మహిళలు తక్కువ ఓపెన్‌గా ఉంటారని బంబుల్ పరిశోధన చూపిస్తుంది. డేటింగ్ చేస్తున్న వారికి ప్రస్తుత సామాజిక సమస్యల విసయం పట్టనట్లు ఉంటే, వారితో దూరం జరుగుతున్నారు. బంబుల్ పరిశోధన ప్రకారం డేటింగ్ విషయానికి వస్తే భారతీయులు తమ భాగస్వాములతో కలిసి ఉండాలని కోరుకునే అతి ముఖ్యమైన సామాజిక కారణం మానవ హక్కుల సమస్యలు (64%), అలాగే సమీక్ష ప్రకారం 38% భారతీయ మహిళలకు కూడా కాబోయే భాగస్వామికి తమలాగే అదే విలువల పట్ల మక్కువ ఉండటం ముఖ్యం.
2. బెటర్‌మెంట్ బర్న్‌అవుట్: బయోహ్యాకింగ్, మీ రోజును ఉదయం 5 గంటలకు ప్రారంభించడం నుంచి, సెల్ఫ్-హెల్ప్ పాడ్‌క్యాస్ట్‌లలోకి ప్లగ్ చేయడం వరకు, వ్యక్తులు ‘సెల్ఫ్-ఆప్టిమైజింగ్’- తమలో తాము పరిపూర్ణమైన సంస్కరణగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా మంది సింగిల్స్ (55%) తమను తాము మెరుగుపరుచుకునే మార్గాలను నిరంతరం వెతకడానికి ఒత్తిడిని అనుభవించడానికి కారణమవుతుండగా, 4లో 1 (24%) భాగస్వామికి అనర్హులని భావించారు. మనం 2024 కోసం ఎదురు చూస్తున్నప్పుడు, సింగిల్స్ నిరంతరం స్వీయ-అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సమీక్షకు స్పందించిన 3 మంది మహిళల్లో 2 కన్నా ఎక్కువ మంది (68%) వారు ఇక్కడ, ఇప్పుడు ఉన్నవారితో సంతోషంగా ఉండటానికి చురుకైన చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి, 56% భారతీయ మహిళలు ఇప్పుడు వారిని మార్చడానికి ప్రయత్నించని వ్యక్తులతో మాత్రమే డేటింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
3. సహజమైన సాన్నిహిత్యం: నేటి వ్యక్తులకు, ముఖ్యంగా మహిళలకు, ఆకర్షణ అనేది ఒక ముఖ్య విషయంగా కనిపిస్తుంది: భావోద్వేగ సాన్నిహిత్యం. ఒంటరిగా ఉన్నవారు భద్రత, రక్షణ, అవగాహనను గుర్తించడపై దృష్టి సారించారు. భారతదేశంలో బంబుల్ సమీక్షకు స్పందించిన మూడవ వంతు మంది (35%) ఇప్పుడు సెక్స్ కన్నా భావోద్వేగ సాన్నిహిత్యం చాలా ముఖ్యమైనదని, శారీరక సంబంధం కన్నా ఇది మరింత ఆకర్షణీయంగా ఉందని విశ్వసిస్తున్నారు. డేటింగ్ విషయానికి వస్తే, 4 మందిలో 3 మంది స్త్రీలు (78%) తమ భాగస్వామికి భావోద్వేగం, శారీరక సాన్నిహిత్యం రెండింటిపై అవగాహన కలిగి ఉండటమే ముఖ్యమని చెప్పారు. అలాగే, 2024లో మీ అనుభూతిని ఆస్వాదించే సమయం వచ్చింది.
4. ఓపెన్-హార్టెడ్ మగటిమి: ఫ్యాషన్, మీడియా, సంగీతం, సినిమాలలో (కెన్-ఎర్జీ, ఎవరైనా?) మగటిమి, లింగ ప్రధాన పాత్రల గురించి ప్రపంచ సంభాషణలతో ఏడాది పూర్తయింది. సంబంధాల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా 4 మందిలో 1 (25%) వ్యక్తి తమ ప్రవర్తనను చురుకుగా మార్చుకున్నారని, వారు గతంలో కన్నా డేటింగ్ చేస్తున్న వ్యక్తులతో మరింత చురుకుగా, ఓపెన్‌గా ఉంటున్నామని పేర్కొన్నారు. భారతీయ పురుషులలో నాలుగింట ఒక వంతు(26%), కొత్తగా కనుగొన్న ఈ బహిరంగత వారి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపింది, 37% భారతీయ పురుషులలో దుర్బలత్వం లేకపోవడం ఇప్పుడు డేటింగ్ డీల్ బ్రేకర్‌గా మారింది.
5. MVP (అత్యంత విలువైన భాగస్వామి): నూతన మహిళా టెన్నిస్ స్టార్లు, స్పోర్ట్స్ డాక్యుమెంటరీల నిరంతర ప్రవాహం, వచ్చే ఏడాది జరిగే ప్రపంచ పోటీలతో, డేటింగ్‌లో క్రీడలు మొదటి వరుసను ఆక్రమించేందుకు సిద్ధంగా ఉన్నాయి, లేదా మనం అందరం మన సొంత టేలర్, కెల్సే ప్రేమ కథ తర్వాత ఉంటామా? సమీక్షకు స్పందించిన 35% ఒంటరి భారతీయులకు, మీరు ఆటగాడు లేదా ప్రేక్షకులు అనే దానితో సంబంధం లేకుండా క్రీడల పట్ల భాగస్వామ్య ప్రేమ ఇప్పుడు ‘తప్పక కలిగి ఉండాలి’. మరో 30% ఒంటరి భారతీయులతో కలిసి క్రీడలకు హాజరు కావడం ముఖ్యమని, మిలీనియల్స్ (26%) కన్నా జెన్ జడ్ (33%)తో మనం ఎలా డేటింగ్ చేస్తున్నామో కూడా క్రీడలపై మనకున్న మక్కువ మారుతోంది. భారతదేశంలోని బంబుల్‌లో దాదాపు మూడు వంతులు (73%) ప్రొఫైల్‌లు క్రీడా ఆసక్తి బ్యాడ్జ్‌ను కలిగి ఉన్నాయి. అగ్ర అథ్లెటిక్స్‌లో క్రికెట్, ఫుట్‌బాల్ లు ఉన్నాయి:
6. డేట్‌ను పరిగణించండి: ఈ ఏడాది స్వీయ-సంరక్షణ, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సగానికి పైగా (58%) సింగిల్స్ తమ మానసిక ఆరోగ్యం గురించి మరింత ఓపెన్‌గా ఉండేందుకు, వేగాన్ని తగ్గించేలా గట్టి ప్రయత్నం చేసేందుకు అవకాశం కల్పించింది. ఒంటరి భారతీయులు తమ మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా కాపాడుకునేందుకు తమ డేటింగ్‌ను రీఫ్రేమ్ చేస్తుండగా, 3 మందిలో 1 వ్యక్తి (33%) చురుకుగా ‘slow-dating’ చేస్తున్నారు. ఎక్కువగా స్త్రీలలో పరిమాణం కన్నా నాణ్యతను నిర్ధారించుకునేందుకు వారు ఎంత డేటింగ్ చేస్తున్నారో పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాస్తవానికి, 42% మంది భారతీయ మహిళలు సమయం, స్వీయ-సంరక్షణ రెండింటికీ విలువనిచ్చే వ్యక్తుల కోసం చురుకుగా వెతుకుతున్నారు. ఇది మహమ్మారిలో బంబుల్ గుర్తించిన ట్రెండ్‌ను తిరిగి తీసుకువస్తోంది. భారతదేశంలోని 4 మందిలో 1 వ్యక్తి (25%) ప్రేమతో “ఉద్యోగ-సంతృప్తిని” సవాలు చేస్తూ డేట్‌ను చురుకైన చెక్‌లిస్ట్ వ్యాయామంగా పరిగణిస్తున్నారు.
బంబుల్స్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ ఇలా అన్నారు.. “2023లో, మేము ట్రావెల్ రొమాన్స్, కొత్త హద్దులు సెట్ చేయడం, మీ తీరుకు వెలుపల డేటింగ్‌పై ట్రెండ్‌లను గుర్తించాము. ద్వేషం, స్త్రీల హక్కులు, సామాజిక సమస్యల గురించి మన డేటింగ్ జీవితాలతో ముడిపడి ఉన్న సాంస్కృతిక సంభాషణలు ఈ ఏడాది చాలా మందిని ప్రభావితం చేశాయని మాకు తెలుసు. ఇది వ్యక్తులు డేటింగ్ చేయాలనుకునే విధానాన్ని ప్రభావితం చేసింది వ్యక్తులు తమ స్వీయ భావనలో మరింత సాధికారత పొందుతున్నారు. సామాజిక కారణాలు, జీవనశైలి ఎంపికలు లేదా వారి ఇష్టమైన క్రీడలు అయినా తమకు ముఖ్యమైన వాటిని విలువైన వ్యక్తుల కోసం వెతుకుతున్నారని గుర్తించాము’’ అని వివరించారు.
ప్రజలు ఇప్పుడు ఎక్కువగా తమను తాము పరిశీలించుకుంటూ, తమను తాము ప్రామాణికమైన సంస్కరణలుగా చూపాలని కోరుకోవడం చాలా ఉత్సాహంగా ఉంది. ఈ 2024 స్వీయ సంవత్సరాన్ని తీసుకువస్తుందని మేము అంచనా వేస్తున్నాము. ఒంటరిగా ఉన్న భారతీయులు తాము దేనికి విలువనిస్తారో, దేని కోసం నిలబడరు అనేదానిని ప్రాధాన్యతనివ్వడానికి గతంలో కన్నా ఎక్కువ సాధికారతను కలిగి ఉంటారు. ఇది వారి శృంగార జీవితంలో వారు ఏమి కోరుకుంటున్నారనే దాని గురించి కొత్త స్పష్టతకు దారి తీయనుంది.
రానున్న 2024లో అత్యధిక ప్రయోజనాలను పొందేందుకు, సింగిల్స్‌కు సాధికారత కల్పించేందుకు, బంబుల్ Best Beesతో పాటు ఫీచర్‌లను ప్రారంభించగా, ఇది మరింత సంబంధిత కనెక్షన్‌లను వేగంగా కనుగొనడంలో మీకు సహాయపడటానికి నాలుగు అనుకూల ప్రొఫైల్‌ల క్యూరేటెడ్ రోజువారీ సెట్‌ను అందిస్తుంది. క్రీడలు లేదా సుస్థిరత పట్ల మీ అభిరుచిని కూడా పంచుకునే వారిని చూసారా? మీరు Compliments ఫీచర్‌తో సందేశాన్ని పంపవచ్చు.