Monday, December 23, 2024

అదుపు తప్పిన చంద్రయాన్ శకలం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయింది, కానీ విరామం తరువాత ఇప్పుడు ఇందులో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. చంద్రయాన్ 3 లాంఛ్ వెహికిల్ ఎల్‌విఎం 3 ఎం 4కు చెందిన క్రయోజెనిక్ ఇంజిన్ ఎగువ భాగం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఈ భాగం అదుపు తప్పి అసాధారణ రీతిలో ఇప్పుడు భూ కక్షలోకి దూసుకువచ్చినట్లు ఇస్రో అధికారులు గురువారం ఇక్కడ తెలిపారు. ఇప్పుడు భూ వాతావరణంలో కన్పించిన రాకెట్ భాగం ఈ వాహకనౌకదే అని నిర్థారించారు. బుధవారం మధ్యాహ్నం 2:42 గంటలకు ఈ శకలాన్ని గుర్తించారు. ఈ ఏడాది జులై 14వ తేదీన చంద్ర మండలంపైకి వజయవంతంగా వెళ్లిన చంద్రయాన్ 3 భాగం ఇప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, దీని ప్రభావం చివరికి ఉత్తర పసిఫిక్ సముద్రంపై ఉంటుందని, అక్కడ ఎక్కడైనా ఇది పడేందుకు వీలుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని తుది మజిలీ భారతీయ భూభాగంపై ఉండకపోవచ్చునని వెల్లడించారు. లాంఛ్ వెహికల్ ప్రయోగం తరువాత 124 రోజులకు దీని ముడిభాగం వెనుదిరిగింది.

ప్రయోగ ఘట్టం తరువాత సాధారణంగా అయితే ఈ వాహక నౌక క్రియోజెనిక్ అప్పర్ స్టేజ్ కక్షలోనే కనీసం పాతిక సంవత్సరాలు ఉండాల్సి ఉంది. అంతరిక్షంలో శిథిలాల సంబంధిత అంతర్జాతీయ సమన్వయ కమిటీ (ఐఎడిసి) సిఫార్సులు ఈ విధంగా ఉన్నాయని ఇస్రో తెలిపింది. అంతరిక్షం నుంచి భూమిపైకి దూసుకువచ్చే ప్రయోగశకలాల సమస్య సంక్లిష్టం అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో దీనిపై వివాదాలు నెలకొంటున్నాయి. కేవలం ప్రయోగాలు విజయవంతం చేయడమే కాకుండా, అనంతరం అవి ఉండాల్సిన నిర్ధేశిత కక్షల్లో సజావుగా ఉండటం లేదా నిర్ణీత దారిలో ప్రయాణించడం కీలకమని నిపుణులు చెపుతున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్ 3 శకలం రీ ఎంట్రీ, ఇది సముద్రంలో పతనం చెందడం వివాదాస్పదం అవుతుందనే ఆందోళన వ్యక్తం అయింది. అయితే తాము ఈ ప్రయోగం దశలో అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను పాటించినట్లు ఇస్రో తెలిపింది. ఈ విషయాన్ని ఐఎడిసి కూడా నిర్థారించిందని వెల్లడించారు. ఏది ఏమైనా అంతరిక్ష వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన కట్టుబాట్లను తాము గౌరవిస్తామని ఇస్రో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News