Friday, November 22, 2024

పిల్లలు భూమికి భవిష్యత్తు

- Advertisement -
- Advertisement -

There is a brilliant child locked inside every student. – Marva Collins
The greatest legacy one can pass on to one’s children and grandchildren is not money or other material things accumulated in one’s life, but rather a legacy of character and faith. Billy Graham
Encourage your child to have muddy, grassy or sandy feet by the end of each day, that’s the childhood they deserve. Penny Whitehouse
నవంబరును ఫిలిప్పీన్స్ మొదలు ఆయా ప్రపంచ దేశాలు బాలల మాసంగా జరుపుకుంటున్నాయి. మనకూ నవంబరు 14 బాలల దినోత్సవం. చిన్నారుల నేస్తమైన తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతటా బాలోత్సవాల్లో పిల్లల సంక్షేమం గురించి చర్చలు, తీర్మానాలు జరుగుతాయి. పెద్దవాళ్లంగా మనకు మనకు మనకంటే చిన్నవాళ్లు వయస్సున్నవాళ్లు సైతం పిల్లలుగానే కనిపిస్తారు. కానీ, పిల్లలు అంటే పన్నెండేళ్ల లోపు చిన్నారులు, కొంచెం వయస్సును పొడిగిస్తే పద్నాలుగేండ్ల లోపు, ఇంకొంచెం పెంచితే పద్దెనిమిది ఏండ్లు నిండని కౌమార ప్రాయులు కూడా పిల్లలే. ప్రపంచంలోని దాదాపు 19% మంది పిల్లలకు భారతదేశం నివాసం. దేశ జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ. పిల్లల జనాభా దాదాపు 48 కోట్లు. అంటే ప్రపంచంలోని ప్రతి ఐదవ బిడ్డ భారత దేశంలో నివసిస్తున్నట్టు లెక్క. అట్లాగే ప్రపంచంలో పోషకాహార లోపం ఉన్న ప్రతి మూడో బిడ్డ మన దేశంలోనే ఉంది. ప్రతి రెండవ భారతీయ శిశువు తక్కువ బరువుంటాడు. భారత దేశంలోని నలుగురు పిల్లలలో ముగ్గురు రక్తహీనతతో బాధపడుతున్నారు.

అయోడిన్ లోపం కారణంగా ప్రతి నవజాత తాము నేర్చుకునే సామర్థ్యాన్ని తక్కువగా కలిగి వుంటున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ విధానాలు, జాతీయ కార్యక్రమాలను పరిశీలిస్తే, పిల్లల అవసరాలు, ఇప్పటికే ఉన్న వనరుల మధ్య చాలా అంతరం వున్నట్లు స్పష్టమవుతుంది. భారత దేశంలో స్వతంత్ర లేదా సమగ్రమైన పిల్లల మానసిక ఆరోగ్య విధానం ఏదీ లేకపోవడం విషాదం. పిల్లల బహుళ అవసరాలకోసం విభిన్న కార్యక్రమాలను వేరువేరు మంత్రిత్వ శాఖల ద్వారా కవర్ చేయబడుతున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకే గొడుగు కింద కవర్ చేయడానికి సమగ్ర విధానాన్ని రూపొందించడం ఇప్పుడు చాలా అవసరం. మన దేశంలో సాంప్రదాయకంగా పిల్లల పెంపకం, సంరక్షణ బాధ్యత వారివారి కుటుంబాలపై మోపబడింది. తమ పిల్లలను బాగా చూసుకోవడానికి ఉద్దేశించిన బలమైన పితృస్వామ్య కుటుంబాలు పిల్లలు స్వంత హక్కులు కలిగివున్నారన్న విషయాన్ని చాలా అరుదుగా గ్రహిస్తారు. భారత రాజ్యాంగం బాలలకు అనేక ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చినప్పటికీ ఈ హక్కులను నెరవేర్చే విధానం ఎల్లప్పుడూ హక్కుల ఆధారితంగా కాకుండా పిల్లలు ఎక్కడ అవసరం పడతారన్న దాన్ని బట్టే కొనసాగుతూ వస్తున్నది. ప్రభుత్వం, పౌర సమాజం అనుసరిస్తున్న బాలల హక్కుల ఆధారిత విధానంలో అభివృద్ధి పరివర్తన మరింత జరగాల్సివుంది.

అభ్యసనం విషయానికొస్తే ‘ఏమి ఆలోచించాలో కాదు, ఎలా ఆలోచించాలో నేర్పించాలి పిల్లలకు’ అంటుంది అమెరికన్ సాంస్కృతిక మానవ శాస్త్రవేత్త మార్గరెట్ మీడ్. పిల్లల సంగతి అటుంచితే, ఆలోచించే సామర్థ్యం మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆలోచన ఏం చేస్తుంది? అనే ప్రశ్నకు ఆలోచనే అన్నీ చేయిస్తుందనేదే మనో విజ్ఞానశాస్త్రం ఇస్తున్న జవాబు. ఆలోచన ఎన్ని రకాలు అనే ప్రశ్నకు సమాధానంగా ‘అంచనాలను ప్రశ్నించడం (Question assum ptions), తర్కం ద్వారా కారణాన్ని నిరూపించడం (Reason through logic), ఆలోచనను వైవిధ్యపరచడం (Diversify thought)’ అనే మూడింటిని తన పరిశోధన ద్వారా ధ్రువీకరించారు రీబూట్ ఫౌండేషన్ అధ్యక్షురాలు హెలెన్ లీ బౌగ్స్. ఇక పిల్లల విషయానికొస్తే, పిల్లలెవరు అనేదాని కన్నా పిల్లలేమిటి అనే ప్రశ్నకు తమకు తెలిసింది కొంచెమేనని పెద్దవాళ్లంతా గుర్తెరగాల్సి వుంది. పిల్లల అభివృద్ధిని గమనించి పర్యవేక్షించడం పెద్దల బాధ్యత. ఈ గమనింపు,

పర్యవేక్షణలే పిల్లలు తమ అభివృద్ధి మైలురాళ్లను చేరుకోవడానికి ముఖ్యమైన సాధనాలు. పిల్లల అభివృద్ధిలో జ్ఞానం (Cognition), సామాజిక పరస్పర చర్య, భావోద్వేగ నియంత్రణ (Social interaction and emotional regulation), ప్రసంగం, భాష (Speech and Langu age), శారీరక నైపుణ్యాలు (Physical skills), ఇంద్రియ అవగాహన (Sensory awareness) అనేవి చాలా కీలకమైనవి. ఈ ఐదు విభాగాల్లో పిల్లల నడత స్థాయిని బట్టి పిల్లలేమిటి అనేది నిరూపణ అవుతుంది. ‘పిల్లలు ఎల్లప్పుడూ ఇల్లు ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు, అందుకే లైట్లు ఆఫ్ చేయరు’ అంటాడు రాల్ఫ్ బస్. ‘పెద్దలు మార్గాలను అనుసరిస్తారు. పిల్లలు అన్వేషిస్తారు’ అంటాడు నీల్ గైమాన్. ‘మీరు మీ పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతులు బాధ్యత మూలాలు, స్వాతంత్య్రానికి రెక్కలు’ అంటాడు డెనిస్ వెయిట్లీ. ‘బ్యాటరీల ద్వారా కాకుండా వారి ఊహల ద్వారా శక్తినిచ్చే బొమ్మలను పిల్లలకు ఇవ్వండి’ అంటాడు హెచ్. జాక్సన్ బ్రౌన్. ఈ వ్యాఖ్యలు పిల్లల పోషణ అభివృద్ధికోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎంత వినూత్నంగా, సృజనాత్మకంగా ఉండాలో తెలియపరుస్తున్నాయి. పాలో కోయెల్హో అభిప్రాయ పడినట్టు పిల్లలు పెద్దలకు మూడు విషయాలు నేర్పించగలరు. అవి 1. కారణం లేకుండానే సంతోషంగా ఉండటం, 2.ఎల్లప్పుడూ ఏదో ఒక కృత్యంలో బిజీగా ఉండటం, 3. అతను కోరుకునే దానిని తన శక్తితో ఎలా డిమాండ్ చేయాలో తెలుసుకోవడం.

‘పిల్లలను పెంచడానికి ఒక గ్రామం అవసరం’ అనేది ఆఫ్రికా సామెత. దీన్నే రివర్స్ చేసి ‘ఒక గ్రామాన్ని పెంచడానికి ఒక బిడ్డ అవసరం’ అంటోంది ఢిల్లీకి చెందిన ‘చైల్డ్ & అడోల్సెంట్ మెంటల్ హెల్త్ ’ నిపుణురాలు డా. షెల్జా సేన్. ఈమె రాసిన ‘Love, The Art of Mindful Parenting’, ‘Imagine, No Child Left Invisible’ గ్రంథాలు రెండూ పిల్లల ఎదుగుదలకు, ముగ్ధత్వానికి సంబంధించి విలువైన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని పిల్లల ఆలోచనల లోతులను విశదీకరిస్తాయి, పిల్లలకు కావలసిన అసలైన పాఠశాలల (True Schools)ను స్వప్నించే ఉపాధ్యాయలకు, తల్లిదండ్రులకు, కౌన్సిలర్లకు, థెరపిస్టులకు, యాక్టివిస్టులకు, థాట్ లీడర్లకు, ఛేంజ్ ఏజెంట్లకు మద్దతునిస్తాయి. మానవ జీవితంలో మొదటి 5 సంవత్సరాలే సానుకూల అనుభవాలు, గాఢత నిండిన ప్రతిస్పందనా సంబంధాలు పిల్లల అభివృద్ధిని వేగవంతం చేస్తూ మెదడులో మిలియన్ల కనెక్షన్‌లను సృష్టిస్తాయి. నిజానికి మరే ఇతర సమయాల కంటే మొదటి 5 సంవత్సరాలే అత్యంత కీలకమైనవి. జీవితాంతం నేర్చుకోవడం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక పరివర్తనలకు సంబంధించిన పునాదులు వేయబడే కాలం ఇదే.

యునిసెఫ్ (UNICEF) ప్రచురించిన ‘ఎర్లీ మూమెంట్స్ మేటర్ ఫర్ ఎవ్రీ చైల్డ్’ ప్రకారం క్యూబా, ఫ్రాన్స్, పోర్చుగల్, రష్యా, స్వీడన్‌తో సహా కేవలం 15 దేశాల్లో మాత్రమే చిన్న పిల్లల ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి తోడ్పడే మూడు విధానాలు ‘1. రెండు సంవత్సరాల ఉచిత పూర్వ ప్రాథమిక విద్య, 2. బాలింతలకు మొదటి ఆరు నెలలు పిల్లలకు పాలుపట్టే విరామాలు కల్పించడం, 3. తల్లిదండ్రులకు తగినంత సెలవు ఇవ్వడం’ అమలులో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న 32 దేశాల్లో ఐదేళ్లలోపు 85 మిలియన్ల మంది పిల్లలు ఇంతకు చెప్పిన పోషక విధానాలు ఏవీ లేకుండానే పెరుగుతున్నారని యునిసెఫ్ నివేదిక పేర్కొంది. ఈ ముప్పై రెండు దేశాల సరసన ఇండియా కూడా ఉంది. పిల్లలకు సంబంధించి అతి ముఖ్యమైన విషయం ఏమిటి? అంటే, అది వాళ్ల మెదడు. కానీ పిల్లల శరీరాల పట్ల శ్రద్ధ వహించినంతగా వాళ్ల మెదడు గురించి ప్రపంచం పట్టించుకోవడం లేదని యునిసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిల్లల కలలను పెంపొందిస్తే, ప్రపంచం ధన్యమవుతుంది, వికలం చేస్తే ప్రపంచం విధ్వంసం అవుతుందనేదే బాలవికాస నిపుణుల విచారం. పిల్లవాడు తమనుండి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ గురించి గర్విస్తున్నాను, నన్ను క్షమించు, నేను నిన్ను క్షమించాను, నేను వింటున్నాను. ఇది నీ బాధ్యత. సక్సెస్ కోసం ఇంకా ఏం కావాలి?’ అనే ఏడు వాక్యాలనే వినాలనుకుంటాడన్న షెర్రీ కాంప్ బెల్ మాటలు ఉపాధ్యాయులు అలవరచుకోవాలి. భారత సర్వోన్నత న్యాయస్థానం రెండు దశాబ్దాల క్రిందట పిల్లలకు సంబంధించి చేసిన మహద్వ్యాఖ్యను అందరం మననం చేసుకోవాల్సి వుంది. తల్లిదండ్రులు పిల్లలను తమకూ తమ కుటుంబాలకే భవిష్యత్తు సంపద అనుకోవడం పరిపాటి. జనం ఆలోచనా అభిప్రాయమూ అంతే. అయితే, ‘పిల్లలు కుటుంబాలకూ దేశానికీ జాతికే కాదు ప్రపంచానికీ భూమికీ భవిష్యత్తు’ అనింది సుప్రిం కోర్టు. నిజమే కదా. దేశం నలుమూలల్లోని బాలలందరికీ శుభాకాంక్షలు చెబుతూ, చాచా నెహ్రూ బాలచెలిమికి తాదాత్మ్యం చెందుతూ గురువులకూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News