Saturday, December 21, 2024

రేపు బిజెపి మేనిఫెస్టో

- Advertisement -
- Advertisement -

అమిత్ షా చేతులమీదుగా ఆవిష్కరణ

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 18వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్ లో కార్యకర్తల బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీ మేనిఫెస్టోలో ప్రజలకు మేలు చేసే పలు హామీలు ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. శనివారం గద్వాల్, నల్గొండ, వరంగల్ జిల్లాలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News