Monday, November 18, 2024

ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఉద్యమిస్తే రాష్ట్రం వచ్చిందని సిఎం కెసిఆర్ తెలిపారు. కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ ప్రసంగించారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ను కరీంనగర్ నియోకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీకి గ్రౌండ్‌కు పెద్ద చరిత్ర ఉందని, 2001లో ఎస్‌ఆర్‌ఆర్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తు చేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని, ఆనాడు తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో కలిపి పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువకులు బలిదానాలు చేశారన్నారు. తెలంగాణను కాంగ్రెస్ 58 ఏళ్లు కష్టాల పాలు చేసిందని దుయ్యబట్టారు.

అనేక ఉద్యమాల్లో కరీంనగర్ అగ్రస్థానంలో ఉందని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కొనియాడారు. తలసరి విద్యుత్ వినియోగంలో నెంబన్ వన్ స్థానం అని, దేవంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదని కెసిఆర్ విమర్శలు గుప్పించారు. అనుకున్నంత పరిణతి చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం ఓటు అని కెసిఆర్ పేర్కొన్నారు. పార్టీల చరిత్ర నడవడిక, దృక్పథం, అభ్యర్థి గుణగణాలపై చర్చ జరగాలని, మంచి చెడులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News