Monday, December 23, 2024

పొగాకు క్యాన్సర్‌తో ఏటా కోటికిపైగా బలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పొగాకు సేవనం ప్రాణాంతకం అవుతోంది. పలు రకాలుగా టొబాకోకు అలవాటుపడుతూ ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏడు దేశాలలో ఏటా కోటి ముప్పయి లక్షల మంది క్యాన్సర్ సోకి చనిపోతున్నారు. ఈ దేశాలలో ఇండియా కూడా ఉందని ఈ పరిణామంపై జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దీనిని లాన్సెట్ ఇక్లినికల్ మెడికల్‌జర్నల్‌లో ప్రచురించారు.

ఇండియా, బ్రిటన్ , చైనా, బ్రెజిల్, అమెరికా, రష్యా, దక్షిణాఫ్రికాలలో ఈ పొగాకు వైపరీత్య సమస్య గురించి అధ్యయనం చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్యలో సగానికి సగం వరకూ ఈ పొగాకు అలవాటు వారు ఉన్నట్లు నిర్థారణ అయింది. స్మోకింగ్ , దీనితో పాటు స్థూలకాయం, ఆల్కహాల్, హెచ్‌పివి ఇన్‌ఫెక్షన్స్ వల్ల మొత్తం మీద ఏటా రెండు లక్షల మందికి క్యాన్సర్ తీవ్రత పెరిగి మరణాలకు దారితీస్తోందని తేల్చారు.

ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఎఆర్‌సి) , క్వీన్ మేరీ యూనివర్శిటీ ఆప్ లండన్, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ కూడా ఏటా క్యాన్సర్‌తో సంభవిస్తున్న మరణాలపై సర్వే నిర్వహించాయి. క్యాన్సర్ ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక్క వ్యక్తి సెర్వికల్ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దాదాపు 90 శాతం మరణాలు తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో చోటుచేసుకుంటున్నాయి. క్యాన్సర్ కారక అలవాట్లకు దూరంగా ఉంటే మనిషికి సరైన విధంగా ఆయుష్షు దక్కే వీలుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News