- Advertisement -
మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీనతో పలు షాపింగ్ మాల్స్, భవనాలు నేలమట్టం అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రజలు భయకంపితులు అయ్యారు. ఉరుకులుపరుగులకు దిగారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం వివరాలు వెంటనే తెలియలేదు. సునామీ హెచ్చరికలు వెలువడలేదు. బురియాస్‌కు 26 కిలోమీటర్ల దూరంలో భూకంప ప్రధాన కేంద్రం నెలకొని ఉన్నట్లు అమెరికాకు చెందిన భూగర్భ అధ్యయన సంస్థ తెలిపింది. పలు చోట్ల మాల్స్ మూతపడ్డాయి. జనం ఇండ్లను వీడి వీధుల్లోకి వచ్చారు. పసిఫిక్ అగ్నివలయంలో ఫిలిప్పీన్స్ ఉండటంతో ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతుంటాయి.
- Advertisement -