Saturday, December 21, 2024

నక్సల్స్ మందుపాతరకు ఐటిబిపి జవాను బలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  చత్తీస్‌గఢ్‌లోని గరియాబండ్ జిల్ల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపతరకు ఐటిబిపి జవాను బలి అయ్యారు. పోలింగ్ సిబ్బందికి ఎస్కార్గ్ వెళ్లిన భద్రతా జవాన్లు పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఈ జిల్లాలోని బింద్రానవగఢ్ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ తన నియోజకవర్గం పటాన్‌దుర్గ్‌లోని కురుద్ధి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి రాయపూర్‌లోని సివిల్ లైన్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 958 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News