Sunday, December 22, 2024

బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎన్నికలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కమలం గెలుపుపై ధీమా

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసియాపసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు(ఎపిఇసి)లో పాల్గొనడం కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కానీ దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారు. ఈ అయిదు రా ష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన, ఫలితాలు ఎలా ఉండగలవనే దానిపై సదస్సు విరామ సమయంలో ఓ జాతీయ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో పోరుపై ఆ సక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉందని గోయల్ చెప్పడం గమనార్హం.‘ తెలంగాణలో ఓటింగ్ నవంబర్ 30న జరగనుంది. నేను ఇక్కడికి రావడానికి ముందు రెండు పా ర్లు మాత్రమే తెంగాణను సందర్శించా. నేను తిరిగి వెళ్లాక వాస్తవ పరిస్థితి ఏమిటో చూస్తా. అప్పుడు మాత్రమే అక్కడ వాస్తవంగా ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగే స్థితిలో ఉంటా’ అని గోయల్ అన్నారు.

కాగా మిజోరాం లో పరిస్థితి స్పష్టంగా లేదని అభిప్రాయపడిన మంత్రి మిగతా మూడు రాష్ట్రాలు రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలోబిజెపి విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. ఈ మూడు రాష్ట్రాల్లో తాను విస్తృతంగా ప్రచా రం చేశానని తెలిపారు. ఈ మూడు రాష్ట్రాల్లో బిజెపికి ఎదురుగాలి వీ స్తోందన్న ఒపీనియన్ పోల్స్, రాజకీయ విశ్లేషకుల అంచనాలను ఆయన తప్పుబట్టారు..‘ చత్తీస్‌గఢ్‌లో గాలి కచ్చితంగా మా వైపు మళ్లిందని క్షేత్రస్థాయి పరిస్థితులు టీవీ, ఎక్స్( ఇంతకు ముందు ట్విట్టర్)లను బట్టి స్పష్టమవుతోంది. ఇక మధ్యప్రదేశ్‌లో మేము కాంగ్రెస్‌కన్నా స్పష్టంగా ముం దున్నాం. నేను భారత్‌నుంచి బయల్దేరడానికి ముందే ఆ రాష్ట్రం తిరిగి బి జెపికి దక్కనుంది’ అని గోయల్ అన్నారు. తాను రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో విస్తృతంగా పర్యటించానని చెప్పిన ఆయన రాజస్థాన్‌లో వార్ వన్‌సైడ్‌గా ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బిజెపి విజయం సాధించనుందని కూడా ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News