Monday, December 23, 2024

ఇండియా ట్రెండ్స్‌లో మొదటిస్థానంలో ‘కాంగ్రెస్ హంతకులు’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘కాంగ్రెస్ హంతకులు’ ఇండియా ట్రెండ్స్‌లో మొదటి స్థానంలో దూసుకుపోతోంది. తెలంగాణ ఉ ద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకోవడం ఎంతో బాధాకరమని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. చిదంబరం వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందని కెటిఆర్ అన్నారు. మరోవైపు హిరోషిమాపై అణుబాంబు వేసిన అమెరికా సారీ చెప్పినట్టుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ క్రూరత్వాలను తెలంగాణ క్షమించదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్, మంత్రి కెటిఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా చిదంబరం వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చా రు. చిదంబరం స్పందన చాలా ఆలస్యమైందన్న కెటిఆర్ 1952-2014 మధ్య కా లంలో వందల మంది తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని స్పష్టం చేశారు. ఇప్పు డు మీరు ఎంత కష్టపడ్డా కాంగ్రెస్ పార్టీ తె లంగాణకు చేసిన అన్యాయాలను ప్రజలు మర్చిపోరన్నారు. మరోవైపు చిదంబరం వ్యా ఖ్యలపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన మంత్రి హరీశ్ రావు అప్పటి నెహ్రూ ప్రభుత్వం తా త్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాము లు చనిపోయారని అన్నారు. చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు. చిదంబరమే వక్ర భాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. చిదంబరం వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ నే త చిదంబరం మాట్లాడిన తీరు చూస్తుంటే.. హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందని మంత్రులు కెటిఆర్, హరీశ్ విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే యువకులు బలిదానం చేశారని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News