Sunday, January 19, 2025

ఆస్ట్రియా ప్రధానిని కరిచిన మాల్డోవా అధ్యక్షురాలి పెంపుడు శునకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యూరప్‌లోని మాల్డోవా అధ్యక్షురాలు మైయా సందు పెంపుడు శునకం ఆస్ట్రియా ప్రధానిని కరిచిన న్యూస్ వైరల్‌గా మారింది. ఆస్ట్రియా ప్రధాని అలెగ్జాండర్ వాన్‌డెర్ బెలెన్ ప్రస్తుతం మాల్డోవా దేశంలో పర్యటిస్తున్నారు. రెండు దేశాలకు చెందిన అధినేతలు, అధికారులు సమావేశమయ్యారు. మాల్డోవా అధ్యక్షరాలితో అలెగ్జాండర్ సరదాగా మాట్లాడుతుండగా తన శునకాన్ని ఆస్ట్రియా ప్రధానికి ఇచ్చింది.

వెంటనే శునకం అలెగ్జాండర్‌ను కరవడంతో వెంటనే ఆమె క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై ఆస్ట్రియా ప్రధాని సోషల్ మీడియాలో స్పందించారు. తన పెంపుడు శునకాలంటే తనకు చాలా ప్రేమ అని, వాటిని దగ్గరికి తీసుకున్నప్పుడు ఉత్సాహంతో కరిచి ఉండొచ్చని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పెంపుడు శునకం కమాండర్ ఉండేది. వైట్‌హౌస్‌కు వచ్చిన పలువురు సిబ్బందిని కరిచింది. పది సార్లకు పైగా సిబ్బందిని కరవడంతో ఆ శునకాన్ని శ్వేతసౌధం నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News