Monday, November 25, 2024

రాహుల్‌పై కేసు పెట్టిన పూర్ణేశ్ మోడీకి కీలక పదవి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘మోడీ ఇంటి పేరు’ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకిపై పరువు నష్టం కేసు పెట్టిన బీజేపీ నేతకు కీలక పదవి లభించింది. రాహుల్‌పై సూరత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పూర్ణేశ్ మోడీని దాదానగర్ దయ్యూలో పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా అధిష్ఠానం నియమించింది. అదే విధంగా మరో బీజేపీ నేత దుష్యంత్ పటేల్‌కు కోఇంచార్జీగా పదవి లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నియామకాలు చేపట్టినట్టు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

2019లో కర్ణాటక లోని కొల్లార్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ‘మోడీ ఇంటి పేరు ’ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో రాహుల్‌పై గుజరాత్ బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ పూర్ణేశ్ మోడీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

దీంతో మరుసటి రోజే లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత దిగువస్థాయి కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News