Tuesday, December 24, 2024

బ్రిటిష్ కాలం నాటి రైఫిల్స్‌కు ఢిల్లీ పోలీస్ స్వస్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత కొన్ని దశాబ్దాలుగా ఢిల్లీ పోలీస్‌ల అధీనంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి ఏడు వేల .303 రైఫిళ్లకు త్వరలో స్వస్తి పలకనున్నారు. బ్రిటన్ ఆయుధ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైఫిల్స్‌ను మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల్లో ఉపయోగించారు. 1962లో భారత్ చైనా యుద్ధ సమయంలో వీటిని భారత్‌లో ఉపయోగించారు. ఆ తరువాత వీటిని రాష్ట్ర పోలీస్‌లకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వీటిని ఉపసంహరించుకున్నాయి. ముంబైలో 26/11 ఉగ్రదాడుల తరువాత అక్కడి పోలీస్‌లు వీటికి బదులుగా ఎకె 47 రైఫిల్స్‌ను వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ రైఫిల్స్ ఒక్కోటి 5 కిలోల వరకు బరువు ఉంటాయి. ఢిల్లీ పోలీస్ ఆయుధాగారంలో పేరుకుపోయి ఉన్న ఈ రైఫిల్స్‌ను తొలగించే కార్యక్రమాన్ని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News