Monday, December 23, 2024

కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం జాప్యంపై సోమవారం సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలుగా నియామకానికి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు ఆమోదం తెలపడంలో కేంద్రం జాప్యం చేయడానికి సంబంధించిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియా, సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలుగా నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో కేంద్రం తనకిష్టమైన వాళ్లను మాత్రమే ఎంపిక చేసి జడ్జీలుగా నియమించడం సమస్యగా మారుతోందని నవంబర్ 7నఈ పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒక హైకోర్టునుంచి మరో హైకోర్టుకు బదిలీ కోసం సిఫార్సు చేసిన పేర్లు పెండింగ్‌లో పెట్టడంపైన కూడా పర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీలకు సంబంధించిన వ్యవహారాలను పెండింగ్‌లో ఉంచడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. ఈ విషయాన్ని అంశం.

ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అటార్నీ జనరల్‌ను కోరుతున్నాం’ అని విచారణ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం వద్ద 14 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు అంటూ, దీనిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి స్పందనా లేదని కూడా స్పష్టం చేసింది. కొలీజియం వ్యవస్థ ద్వారా ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలను నియమించడంపై కొంతకాలంగా కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు కొలీజియం విధానంపై వివిధ వర్గాలనుంచి విమర్శలు కూడా వచ్చాయి. సుప్రీంకోర్టు విచారించనున్న రెండు పిటిషన్లలో 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన గడువుకు కట్టుబడి ఉండనందుకు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖపై కోర్టు ధిక్కరణ చర్య తీసుకోవాలని కోరుతూ బెంగళూరుకు చెందిన అడ్వకేట్స్ అసోసియేషన్ దాఖలు చేసినపిటిషన్ కూడా ఉంది. కొలీజియం గనుక తమ సిఫార్సులను ఏకగ్రీవంగా పునరుద్ఘాటించిన పక్షంలో కేంద్రం మూడు నాలుగు వారాల్లోగా జడ్జీలను నియమించాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News