Saturday, December 21, 2024

వాహనంపై విరిగి పడ్డ కొండచరియలు.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అరుణాచల్ ప్రదేశ్ లోని కామ్లె జిల్లాలో వాహనంపై కొండచరియలు విరిగి పడడంతో అందులో ప్రయాణిస్తున్న ఆధ్యాత్మిక గురువు, అతని అనుచరులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన శుక్రవారం అరుణాచల్ జాతీయ రహదారిపై జరిగిందని పోలీస్ సూపరింటెండెంట్ థుటాన్ జాంబా వెల్లడించారు. ఆధ్మాత్మిక గురువు క్రిస్టోఫర్ హెంబ్రోమ్ పశ్చిమబెంగాల్ లోని జలపాయ్‌గురికి చెందిన వారు కాగా, ఆయన శిష్యులు అస్సాంకు చెందిన వారు. ఎగువ సుబన్సిరి జిల్లా లోని డుంపొరిజో వద్ద మూడు రోజుల పాటు జరిగిన ఒక పండగలో పాల్గొని వీరు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాగా పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకుని శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో శిధిలాల నుంచి మృతదేహాలను వెలికి తీయడమైందని ఎస్‌పి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News