Saturday, November 23, 2024

స్పెస్ ఎక్స్ రాకెట్ విఫలం..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : బిజినెస్ టైటాన్ ఎలన్‌మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం నిర్వహించిన భారీ రాకెటు ప్రయోగం విఫలం అయింది. దీనిని మెగారాకెట్ షిప్ ప్రయోగంగా పేర్కొంటున్నారు. తొలుత కొంత సాంకేతిక లోపం ఏర్పడింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. సౌత్ టెక్సాస్ నుంచి పరీక్ష తరువాత కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎనిమిది నిమిషాల పాటు అవకతవకలు ఏర్పడ్డాయి. దీనితో ఈ ప్రయోగం విఫలం అయినట్లు తెలిపారు. తరువాత పరిస్థితిని చక్కదిద్దుకుని కొద్ది నిమిషాల తరువాత తిరిగి దీనిని పరీక్షించారు. ఈ దశలో బూస్టర్ పేలింది.

వ్యోమనౌక ముందుకు దూసుకువెళ్లిందని నిర్వాహకులు తెలిపారు. తరువాత కమ్యూనికేషన్ కూడా తెగింది. దీనితో రాకెట్ దారితప్పకుండా చేసేందుకు దీనిని అర్థాంతరంగా మార్గమధ్యంలోనే పేల్చివేశారు. దీనిపై ఆ తరువాత స్పేస్ ఎక్స్ వర్గాలు స్పందించాయి. మనం నేర్చుకున్న వాటి నుంచే మనకు ఆ తరువాతి క్రమంలో విజయం దక్కుతుంది. ఇప్పటి ప్రయోగం తమ సంస్థ విశ్వసనీయతను తెలియచేస్తుందని సంస్థ ప్రకటన వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News