Thursday, December 19, 2024

ఆదివారం రాశి ఫలాలు(19-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. భూములు క్రయవిక్రయాలలో లాభాలు.

వృషభం – సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు పొందుతారు.

మిథునం – చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. సంతానంనకు ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందును.

కర్కాటకం – ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అనుకోని అతిథులను కలుస్తారు.

సింహం – కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. నూతన వస్తు సేకరణ.

కన్య – ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ఇంటా, బయటా ప్రోత్సాహం పొందుతారు.

తుల – దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. సన్నిహితుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు.

వృశ్చికం – కొత్త పనులు ప్రారంభిస్తారు. వస్తు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీర నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖుల కలయిక.

ధనుస్సు – బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం. ధన లాభం.

మకరం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. జీవితభాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానం.

కుంభం – కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పొందుతారు.

మీనం – సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. తగాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సంతానం నకు ఉద్యోగావకాశాలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News