- Advertisement -
హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ లో అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. రెండో రోజుల్లో గృహప్రవేశం ఉండగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు బెదిరింపులకు పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.
- Advertisement -