- Advertisement -
హైదరాబాద్: రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఆదివారం ఉదయం లారీని వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న పోలీస్‌లు ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ఎఎస్‌ఐ రామచంద్ర (ఖిన్విసార్ పోలీస్ స్టేషన్), కానిస్టేబుల్స్ కుంభరామ్, సురేష్ మీనా, థనరామ్, మహేంద్రగా గుర్తించారు. గాయపడిన పోలీస్‌లు రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాకు చెందినవారు. ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం రాజస్థాన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా భద్రతా విధుల కోసం తారానగర్‌కు పోలీస్‌లు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని అభిలషించారు.
- Advertisement -