- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. రెండు రోజుల కితం మూడు జిల్లాలో నిర్వహించిన సభల్లో పాల్గొని బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగా సోమవారం మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి 1 గంటలకు జనగామలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తరువాత 2.45 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.40 వరకు సభలో పాల్గొంటారు.
అనంతరం అక్కడ బయలుదేరి 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉప్పల్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు రోడ్ షో లో పాల్గొంటారు. రోడ్ షో ముగిశాక 8.10 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారు.
- Advertisement -