Wednesday, November 27, 2024

భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కారులో తరలిస్తున్న నగదును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.97,30,000 స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం, ధర్మారావుపేట గ్రామానికి చెందిన మంద అనిల్‌కుమార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా, తొర్రూర్ మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన అర్పుల రవి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అనిల్ సివిల్ కాంట్రాక్టర్ రాజు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

యజమాని ఆదేశం మేరకు సోమాజిగూడలోని తిరుమల్ రెడ్డి ఆఫీస్ నుంచి రూ.97,30,000 తీసుకుని కారులో వరంగల్‌కు బయలు దేరారు. ఇన్నోవాలో వస్తుండగా గ్రీన్ ల్యాండ్స్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా అందులో నగదు లభించింది. నగదుకు సంబంధించిన వివరాలు చూపించాల్సి కోరగా, వారు విఫలమయ్యారు. దీంతో నగదును సీజ్ చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ దుర్గారావు, ఎస్సైలు అశోక్‌రెడ్డి, గగన్‌దీప్, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News