Friday, November 22, 2024

విశాఖ ఇండస్ట్రీస్ రూ.8కోట్లు ఫ్రీజ్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ఓ సెక్యూరిటీ సంస్థకు భారీ ఎత్తున ట్రాన్స్‌ఫర్ చేసిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన నగదును సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. సంస్థ నుంచి బదిలీ అయిన రూ.8కోట్లను ఫ్రీజ్ చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఈ నెల 13వ తేదీ ఉదయం 10.57 గంటలకు విశాఖ ఇండస్ట్రీస్‌కు చెందిన బేంగపేట హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి 8 కోట్ల రూపాయలను విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఐడిబిఐ బ్యాంక్, బషీర్‌బాగ్‌కు ఆర్‌టిజిఎస్ ద్వారా బదిలీ చేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు రావడంతో సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు బషీర్‌బాగ్‌లోని ఐడిబిఐ బ్యాంక్‌కు వెళ్లి రూ.8కోట్ల తరలింపుపై విచారణ చేశారు. నగదు ఐడిబిఐ బ్యాంక్ ఖాతా 0142003072600కు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేస్తున్నట్లు పోలీసులు బ్యాంక్ అధికారులకు లెటర్ ఇచ్చారు. అలాగే ఈ సమాచారాన్ని తెలంగాణ ఎన్నికల జిల్లా వ్యయ నోడల్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చారు. భారీ ఎత్తున డబ్బులు ట్రాన్స్‌ఫర్ కావడంతో ఇన్‌కంట్యాక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. భారీ ఎత్తున డబ్బులు బదిలీ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News