Friday, November 22, 2024

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చేయాల్నిదంతా చేస్తాం:గడ్కరీ

- Advertisement -
- Advertisement -

ఉత్తర కాశి: ఉత్తర కాశిలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, సొరంగంలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం చెక్కుచెదరకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్క్రరీ న్నారు. ఆదివారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామితో కలిసి గడ్కరీ ఘటనా స్థలం వద్ద సాగుతున్న సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమాలయ ప్రాంతంలో భూమి తీరు ఒకే విధంగా ఉండకపోవడం వల్ల రెస్కూ ఆపరేషన్ సవాలుగా మారుతోందని అన్నారు. కొన్ని చోట్ల భూమి మెత్తగా ఉంటుందని, మరికొన్ని చోట్ల కఠినంగా ఉంటుందని, అందువల్ల మెకానికల్ ఆపరేషన్ కష్టమవుతుందని ఆయన అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో సొరంగంలో చిక్కుపడిన వర్కర్ల వద్దకు వేగంగా చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మిషన్ ద్వారా సమాంతరంగా డ్రిల్లింగ్ జరపడం అత్యంత వేగంగా జరిగే విధానమని ఆయన అన్నారు. ఏది ఏమయినా వీలయినంత త్వరగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడమే తమ ప్రయారిటీ అని, దీనికోసం చేయవలసినదంతా చేస్తామని మంత్రి చెప్పారు. చిక్కుపడిన కార్మికులకు నిరంతరాయంగా ఆక్సిన్, విద్యుత్, ఆహారం, నీరు, మందులు పంపుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. గత వారం రోజులుగా సొరంగంలో చిక్కుపడిన 41 మంది కార్మికులకు మొదటి రోజునుంచి కూడా ఆహారం, మల్టీ విటమిన్లు, యాంటీ డిప్రెసన్లు, డ్రైఫ్రూట్లు పైప్‌లైన్ ద్వారా పంపిస్తున్నట్లు హైవేస్ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ కూడా చెప్పారు. అదృష్టవశాత్తు సొరంగం లోపల వెలుతురు, తాగునీరు వంటివి ఉన్నాయన్న ఆయన కార్మికులను కాపాడడానికి మరో మూడు, నాలుగు రోజులు పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News