Sunday, January 19, 2025

‘మిస్ యూనివర్స్’ షెన్నిస్

- Advertisement -
- Advertisement -

శాన్ సాల్వడార్: ప్రతిష్ఠాత్మక ‘ మిస్ యూనివర్స్’ కిరీటం ఈ ఏడాది నిగరాగ్వా భామ సొంతమయింది. షెన్నిస్ పలాసియోస్ ‘ మిస్ యూనివర్స్2023’ టైటిల్‌ను దక్కించుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారంరాత్రి శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా ఎరీనాలో జరిగిన కార్యక్రమంలో మాజీ విశ్వసుందరి అర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఈ పోటీల్లో థాయిలాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్‌గా, ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. దీంతో వీరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఇక ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగ్వా సుందరిగా 23 ఏళ్ల షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యతసంతరించుకున్న 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో 84 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News