Thursday, November 21, 2024

‘గండ్ర’ల వార్

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లిలో ఆసక్తిగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రచారం

మన తెలంగాణ/చిట్యాల : భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిపేరు ఒకటే ఉన్న ఇద్దరు గండ్రల మధ్య టఫ్ ఫైట్ కొనసాగనున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగిన సంక్షేమ అభివృద్ధి ప్రచార హస్త్రంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకరమణారెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా. గత రెడు ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ప్రజలకు సేవ చేసుకునే తనకు ఈసారైనా కల్పించాలంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులకు గ్రౌండ్ లెవల్ కార్యకర్తల నుంచి పూర్తి సహకారం లభిస్తోందిది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి ఓ వైపు నుంచి ప్రచారాన్ని నిర్వహిస్తుండగా, మరోవైపు నుంచి మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు.

అలాగే చిట్యాల మండలం నుంచి బిఆర్‌ఎస్ నుంచి జెడ్పిటిసి గొర్రె సాగర్, పార్టీ క్యాడర్ తో కలిసి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు. ఇదిలావుండగా కాంగ్రెస్ వైపు నుంచి గండ్ర సత్యనారాయణరావుతో పాటు ఆయన కుమార్తె, సతీమణి తమదైన మార్క్‌తో ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా చిట్యాల మండలం నుంచి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, సీఆర్‌పల్లి గ్రామ సర్పంచ్ ముఖిరాల మధు వంశీకృష్ణ గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తనను గెలిపిస్తే భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని గండ్ర వెంకటరమణారెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. కాగా రెండు సార్లు ఓటమి పాలైన తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలు గండ్ర సత్యనారాయణ సానుభూతి సెంటిమెంట్‌తో ప్రచారం సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు చివరి 10 రోజులు కీలకం అయ్యేలా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News