Sunday, December 22, 2024

భర్తను చంపించి…. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎస్ రాయవరం గ్రామంలో కొండలరావు(49), ఉమా అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉంది. సురవరం గ్రామానికి చెందిన చిరంజీవితో గత మూడేళ్ల నుంచి ఉమా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దీంతో రెండు నెలల క్రితం పూలపర్తికి నివాసం మార్చడంతో భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి భార్య ప్లాన్ వేసింది. చిరంజీవి తన స్నేహితుడు సాయిదుర్గతో కలిసి కొండలరావును కలిసి బయటకు తీసుకెళ్లారు. విశాఖపట్నం వెళ్లిన తరువాత కారులో కొండలరావును గొంతునులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోదావరి నదిలో పడేసి తన ప్రియురాలు ఉమాకు చిరంజీవి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఏడో తేది నుంచి తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉమా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోదావరి నదిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉమపై పోలీసులకు అనుమానం రావడంతో తనదైన శైలిలో ప్రశ్నించడంతో తన ప్రియుడితో కలిసి చంపేశానని నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెతో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సిఐ షేక్ గపూర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News