Monday, December 23, 2024

విశాఖలో అగ్ని ప్రమాదం…. 40 బోట్లు దగ్ధం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 40 బోట్లు పూర్తి కాలిపోయాయని బోటు సిబ్బంది తెలిపారు. బోటులో నిద్రిస్తున్న కార్మికులు చనిపోయి ఉంటారని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు బోటులో కార్మికులు లేరని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News