Sunday, December 22, 2024

బీడీ కార్మికుల నడ్డి విరిచింది బిజెపి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కాంగ్రెస్ బిజెపి రెండు తోడు దొంగలని వైద్యారోగ్య, ఆర్థిఖ శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈనెల 26వ తేదీన బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదా సభకు సిఎం కెసిఆర్ హాజరు కానున్న నేపథ్యంలో దుంపలపల్లి రోడ్డు సమీపంలో హరీష్ రావు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇది దుబ్బాకలో ఆ రోజు నాలుగో సభ అని, హెలికాప్టర్ పై ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ రానున్నారు. సమావేశం అనంతరం బై రోడ్డు ద్వారా వెళ్తారని చెప్పారు. పోయిన ఎన్నికలలో దుబ్బాక కి కెసిఆర్ వచ్చి ఉంటే అప్పుడే గెలుపొందేవారు అని, దుబ్బాక అంటే ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ అని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. కెసిఆర్ పర్యటనతో దుబ్బాకలో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున భారీ మెజారిటీ తో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సభకు కత్తిపోట్లతో గాయపడ్డ ఎంపి ప్రభాకర్ రెడ్డి కూడా వస్తారని చెప్పారు. దుబ్బాకలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ ఉంటుందని వివరించారు.

గ్యాస్ సిలిండర్ ధరలను బిజెపి పెంచిందని, హ్యాండ్లుమ్ నడ్డి విడిచింది బిజెపి అని, బీడీ కార్మికుల నడ్డి విరిచింది బిజెపి కాదా? అని ప్రశ్నించారు. బిడిలు చిట్టి బతుకును ఈడుస్తున్న అక్కాచెల్లెళ్లకు బిడి కట్టలపై జిఎస్టి పెంచింది బిజెపి పార్టీ కాదా? అని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ గానీ బిజెపి పార్టీ బిడి కార్మికులను పట్టించుకోలేదు కానీ కెసిఆర్ నెల నెలా 2016 ఇచ్చి కడుపులో పెట్టుకున్నారని ప్రశంసించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తే బీడీ కార్మికుల పింఛను ఐదువేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు తోబుట్టు లాగా ఓ కన్న తండ్రి లాగా కెసిఆర్ అండగా ఉన్నారని, బిజెపికి ఓటు వేయడం అంటే అది మురికి కాలువల వేసినట్లు అని, దుబ్బాకలో అభివృద్ధి చేసే వాళ్ళు కావాలా మాటలు మాట్లాడే వాళ్ళు కావాలా ఆలోచించుకోవాలని హరీష్ రావు సూచించారు. మాటల గారడితో ప్రజలను మోసం చేసేది ఎవరో అందరికీ తెలుసునని చురకలంటించారు. దుబ్బాక ప్రజలంతా పనిచేసే వారికి పట్టం కట్టాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News