Saturday, November 23, 2024

అల్ ఫిషా ఆస్పత్రిలో విదేశీ బందీలు..ఆస్పత్రిలో సొరంగం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజా లోని అతిపెద్ద ఆస్పత్రి “అల్‌షిఫా” ని హమాస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా వాడుకుంటున్నారని ఇజ్రాయెల్ పదేపదే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలమైన సాక్షాలను బయటపెడుతోంది. తాజాగా ఈ ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా విడుదల చేసింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఆ దేశం నుంచి కిడ్నాప్ అయిన కొంతమందిని అల్ బంధించేందుకు తీసుకురావడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. అక్టోబర్ 7న ఉదయం 10.42 నుంచి 11 గంటల మధ్య అల్‌షిఫా ఆస్పత్రి సిసీటివి కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను ఐడీఎఫ్ విడుదల చేసింది.

అందులో చేతిలో ఆయుధాలతో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఓ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కొస్తున్నట్టుగా ఉంది. తీవ్రంగా గాయపడిన మరో బందీని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తున్నట్టుగా వీడియోలో రికార్డ్ అయ్యింది. దీనిపై ఐడీఎఫ్ మిలిటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ స్పందిస్తూ … ఆ బందీలు నేపాల్, థాయ్‌లాండ్ దేశస్థులని తెలియజేశారు. “ ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్కడ ఎలా ఉన్నారో ఇంకా తెలియలేదు. ఇజ్రాయెల్‌పై నరమేధం జరిపిన రోజున అల్‌షిఫా ఆస్పత్రిని వారు వినియోగించుకున్నారని మాత్రం స్పష్టమైంది” అని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఆస్పత్రి కింద సొరంగం
ఇజ్రాయెల్ దళాలు ఆస్పత్రి కింద ఓ సొరంగాన్ని తాజాగా గుర్తించాయి. 10 మీటర్ల లోతులో 55 మీటర్ల పొడవులో ఈ టన్నెల్ ఉన్నట్టు ఐడీఎఫ్ తెలిపింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. గాజా ప్రజలను, ఆస్పత్రి రోగులను “మానవ కవచాలు” గా తమకు రక్షణ కోసం హమాస్ వినియోగించుకుంటోందని
ఐడీఎఫ్ ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News