Friday, December 20, 2024

సర్వీస్ ఓట్లు గ్రామీణ నియోజకవర్గాల్లోనే అత్యధికం

- Advertisement -
- Advertisement -

బహదూర్‌పుర, చార్మినార్, మలక్‌పేటలలో అత్యల్పం
ఇక్కడ ఒక్కో నియోజకవర్గంలో కేవలం 9 సర్వీస్ ఓట్లే
15,406 రాష్ట్రంలో సాయుధ దళాల ఓటర్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ సాయుధ బలగాల ఓట్లు కూడా అంతే ముఖ్యంగా అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకే సర్వీస్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్థులు వారిని ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు.

రాష్ట్రవ్యాప్తంగా 15,406 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 930 మంది, అత్యల్పంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 98 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గ్రామీణ నియోజకవర్గాలలో వందల సంఖ్యలో సర్వీస్ ఓటర్లు ఉండగా.. అర్బన్ నియోజకవర్గాలలో 10 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండటం గమనార్హం.

అత్యల్ప సర్వీస్ ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో 404 మంది, రంగారెడ్డి జిల్లాలో 592, మేడ్చల్ జిల్లాలో 732 మంది సర్వీస్ ఓటర్లున్నారు. రాష్ట్రంలో అత్యల్ప సర్వీస్ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. బహదూర్‌పురా, చార్మినార్, మలక్‌పేట ఒక్కొ నియోజక వర్గాల్లో కేవలం 9 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా సనత్‌నగర్, గోషామహల్ స్మెంట్‌లలో 10 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.

భారత సాయుధ దళాలు, అస్సాం రైఫిల్స్ పారామిలటరీ దళం, సిఆర్ పిఎఫ్, బీఎస్ ఎఫ్, ఐటిబిఎఫ్, జిఆర్ ఈఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగులను సర్వీస్ ఓటర్లుగా పరిగణిస్తారు. వీళ్లు పోస్టల్ బ్యాలెట్ లేదా ప్రాక్సీ ఓట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ సర్వీస్ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ పంపిస్తారు. ఒకవేళ సర్వీస్ ఓటరు విదేశాల్లో ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా పంపిస్తారు. ఆ పేపర్ మీద మీకు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా స్పష్టమైన గుర్తును ఉంచితే ఓటు వేసినట్టు. ఒకవేళ వీరు సూచించిన గుర్తు స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాలెట్ పేపర్ మీద సంతకం లేదా ఏదైనా పదాలు రాసినా ఓటు చెల్లదు. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపరుతో పంపిన ‘ఏ’ గుర్తు ఉన్న చిన్న కవర్లో పెట్టి, సీల్ చేసి, రిటర్నింగ్‌ఎధికారికి పోస్టులో పంపించాలి.

మహిళ సర్వీస్ ఓటరైతే..
ఉద్యోగరీత్యా ప్రస్తుతం వేరే చోట నివాసం ఉంటున్నప్పటికీ సర్వీస్ ఓటర్లు వారి స్థానిక నియోజకవర్గంలో ఓటు వేయవచ్చు. ఒకవేళ కుటుంబంతో సహా కలిసి పోస్టింగ్ చేస్తున్న ప్రాంతంలోనే నివసిస్తే గనక అక్కడే సాధారణ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది.సాధారణంగా సర్వీస్ ఓటరు భార్య, కుటుంబ సభ్యులు కూడా సంబంధిత నియోజకవర్గంలో సర్వీస్ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఒకవేళ సర్వీస్ ఓటరు గనుక మహిళ అయితే ఆమె భర్తకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News