- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా నవంబర్ 9 నుండి 18 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని పాఠశాలలు సోమవారం తిరిగి తెరిరు. సోమవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలలో తమ తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఉదయాన్నే వచ్చారు.
నవంబర్ 20న ఢిల్లీలోని పాఠశాలలు తిరిగి తెరవబడతాయని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడంతో స్కూళ్లన్నీ ఓపెన్ అయ్యాయి. కాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గడం, మెరుగైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కారణంగా పాఠశాలలు తెరిచారు. గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఈ నెల ప్రారంభంలో విద్యా డైరెక్టరేట్ నవంబర్ 9-18 వరకు సెలవులను ప్రకటించింది.
- Advertisement -