Thursday, December 19, 2024

సాగర్ నీటికి కొట్టుకుపోయిన కాలువ షట్టర్

- Advertisement -
- Advertisement -

వందల ఎకరాల్లో నీట మునిగిన వరి పొలాలు
సూర్యాపేట జిల్లాలో ఘటన
చేతికొచ్చిన పంట నీటి పాలైందని రైతుల ఆవేదన

మన తెలంగాణ/చిలుకూరు/నాగర్జునసాగర్ : ప్రధాన కాలువకు వచ్చే నీళ్ళ తాకిడికి ఏర్పాటు చేసిన ఎస్‌కేఫ్‌కు ఉన్నషట్టర్ నుండి కాలువ నీళు పోవడంతో ఆ కాలువకు ఇరుప్రక్కల ఉన్న 100ల ఎకరాల్లో చేతికి వచ్చిన పంట పొలాలు నీట మునిగినాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనుగూడెం పరిధిలో జరిగింది. సాగర్ ప్రధాన కాలువ 113.14 కిలో మీటర్ వద్ద ఎస్‌కేఫ్‌ను నిర్వహించి షట్టర్‌లు ఏర్పా టు చేశారు. షట్టర్‌లు 2 పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈనెల 16వ తేదీ సాగర్ నీళ్ళు 6000 క్యూసిక్కుల నీళ్ళు విడుదల చేశారు. ఈ నీళ్ళు ఖమ్మజిల్లా పాలేరుకు పోతున్నాయి. కాలువ పరిధిలో ఎక్కడ మేజర్, మైనర్, కాలువలకు ఎక్కడ నీళ్ళు పోకుండా నేరుగా పాలేరుకు నీళ్ళు పోవడంతో నీళ్ళ తాకిడికి రాత్రి సమయంలో షట్టర్‌లో ఒక షట్టర్ కొట్టుకోని పోయింది.

దీంతో షట్టర్‌ద్వారా సుమారుగా 1500 క్యూసెకుల నీళ్ళు బేతవోల్ చెరువుకు పోతున్నాయి. దీనితో కాలువ ఇరుప్రక్కల చేతికివచ్చిన పొలాలు పూర్తిగా నీటమునిగినాయి. వరి కోత మిషన్‌లు లేకపోవడంతో పొలాలు చేతికి వచ్చిన రైతులు ఇంకా కోయలేదు. ఈ లోపే ఆ పోలాలు నీట మునిగి పొలాలలో నీళ్ళు చేరినాయి. కాలువ పరిధిలో పోలేనుగూడెం, బేతవోల్ గ్రామంకు చెందిన 550 నుండి 600ఎకరాలు నీట మునిగినాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు.
పరిశీలించిన అధికారులు…
సంఘటన జరిగిన స్థలాన్ని నాగర్జునసాగర్ కాలువను సీఈ రమేష్‌బాబు,ఎస్‌సీనర్సింహారావు,ఈఈసత్యనారాయణ,డీఈ రఘు, ఎఈ సత్యనారాయణ, తహాసీల్దార్ సరిత పరిశీలించారు. కాలువ నీరు తగ్గిన వెంటనే తక్షణమే మరమ్మతులు చేయనున్నట్లుగా తెలిపారు. పోలేనుగూడెం వద్ద భాధిత రైతులను మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి పరామర్శించారు. ప్రభుత్వం బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News