Monday, December 23, 2024

వివేక్ ఇంట్లో ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5.30 నుంచి మంచిర్యాల వివేక్ ఇల్లు, పార్టీ ఆఫీస్‌లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని వివేక్ ఇంట్లోనూ ఐటి తనిఖీలు జరుగుతున్నాయి. సోమవారం చెన్నూరులోని వివేక్ అనుచరుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఐటి రైడ్స్‌కు నిరసనగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ఓటమి భయంతోనే ఐటి రైడ్స్ జరుగుతున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ నేతల ఇండ్లలోనే ఐటి దాడులు చేస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా చెన్నూరులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరు ప్రజలు వివేక్ వెంకటస్వామితోనే కలిసి ఉన్నారన్నారు. చెన్నూరులో బిఆర్‌ఎస్ అభ్యర్థి బాల్కసుమన్ ఆగడాలకు అంతులేకుండాపోయిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News