ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మ్యాన్‌హోల్‌లో దిగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, బిల్‌గేట్స్ మ్యాన్‌హోల్‌లో దిగేందుకు ఓ కారణం ఉంది.. అదేంటంటే?.. నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా బ్రస్సెల్స్‌లో అండర్ గ్రౌండ్ లో ఉన్న సీవర్ మ్యూజియాన్ని సందర్శించేందుకు బిల్‌గేట్స్ మ్యాన్ హోల్‌లోకి దిగారు. మ్యూజియంలో పలువురు శాస్త్రవేత్తలతో సమావేశమన ఆయన.. నగరంలోని మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన వివరాలు, మురుగు నీటి కారణంగా తలెత్తే సమస్యలను వారిని అడిగి తెలుసుకన్నట్లు తన ఇస్టా గ్రామ్ ద్వారా తెలిపారు.
“టాయిలెట్ డే సందర్భంగా బ్రసెల్‌లోని అండర్‌గ్రౌండ్ మ్యూజియంలో అన్ని విషయాలను నేను తెలుసుకున్నాను. మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన చరిత్రను డాక్యుమెంట్ చేస్తున్నాను. 1800లో నగరంలోని మురుగు నీటిని అంతా సెన్నే నదిలో డంప్ చేయడం జరిగింది. దీంతో భయంకరమైన కలరా వ్యాప్తి చెందింది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. 200మైళ్ల డ్రైనేజ్ నెట్‌వర్క్, ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నగరంలోని వ్యర్థాలను ప్రాసెస్ చేస్తాయి” అని వీడియోలో పేర్కొన్నారు.