Monday, January 20, 2025

దుబ్బాకలో రఘునందన్‌ ఓటమి ఖాయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే..50ఏండ్లు వెనక్కి వెళ్లిపోతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరుఫున మంత్రి కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో వస్తోందని.. నమ్మితే గోసపడతారని అన్నారు. దుబ్బాకలో వెయ్యి ఓట్లతో గెలిచిన రఘునందన్‌ రావుకు ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు.డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. పదేళ్లలోనే తెలంగాణను దేశంలోనే అగ్ర రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారని చెప్పారు. తెలంగాణ మరింత అభివృధ్ది జరగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News