Sunday, January 19, 2025

పరేడ్ గ్రౌండ్‌లో 25న బిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: గ్రేటర్‌లో హైదరాబాద్‌లోని బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపే లక్షంగా బిఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఈనెల 25వ తేదీన పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నిక్ల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సభా వేదికగా సిఎం కెసిఆర్ గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల బిఆర్‌ఎస్ అభ్యర్థుల మద్దతుగా ప్రసంగించనున్నారు. ఇందులోభాగంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదద్దడమే లక్షంగా గత తోమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్దిపనులతో పాటు నగరవాసుల సంక్షేమమే లక్షంగ అమలు చేసిన పథకాలను వివరించడంతో పాటు మరోసారి అధికారం చేపట్టిన తర్వాత గ్రేటర్‌లో చేపట్టనున్న మరిన్ని అభివృద్దిపనులు, సంక్షేమ పథకాలను సిఎం ప్రకటించే అవకాశం ఉంది.

ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు :
పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ నెల 25న నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను సనత్‌నగర్ నియెజకవర్గం బిఆర్‌ఎస్‌అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు సంబంధించిన సభ కావడంతో ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు గ్రేటర్ వ్యాప్తంగా 2 లక్షలకు పైగాజనం హాజరు అయ్యే అవకాశం ఉండడంతో ఏలాంటి ఇబ్బందులు కల్గకుండ అదే స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా వాహనాల పార్కింగ్‌కు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. సభా వేదిక పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల చుట్టూ 24 నియోజకవర్గాల వారిగా ప్రత్యేకంగా పార్కింగ్‌కు స్థలాలను గుర్తించడంతో పాటు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

సభఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని :
ఈనెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బిఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.మంగళవారం సాయంత్రం టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ తో కలిసి పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సభా వేదిక ఏర్పాటు, సభా ప్రాంగణంలో కి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై పలు సూచనలు చేశారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News