Monday, December 23, 2024

రాజస్థాన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు,
పంచాయతీ స్థాయిలో రిక్రూట్‌మెంట్,
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుప్రకారం ఎంఎస్‌పి
చిరంజీవి ఆరోగ్యబీమా రూ.25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంపు

జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. కులగణన సర్వే చేస్తామని, రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీలు గుప్పించారు. పంచాయతీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ చేపడతామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని కూడా పేర్కొన్నారు.

చిరంజీవి ఆరోగ్య బీమా కింద లబ్ధిదారులకు ఏటా రూ.25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు రెట్టింపు బీమా అందిస్తామని , చిన్న వ్యాపారులకు, దుకాణదారులకు, యువ పారిశ్రామికవేత్తలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణసౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో వివరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యమంత్రి గెహ్లాట్, పిసిసి చీఫ్ గోవింద్ సింగ్ డోటస్రా, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ సిపి జోషి, మాజీ డిప్యూటీ సిఎం సచిన్ పైలట్, తదితర నేతలు పిసిసి కార్యాలయంలో ఈ మేనిఫెస్టో విడుదలలో పాలుపంచుకున్నారు. మేనిఫెస్టో లోని ముఖ్యమైన అంశాలను జోషి ప్రత్యేకంగా వివరించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతుధర కల్పిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News