రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ‘కోట బొమ్మాళి పీఎస్ ప్రచార సభ’ పేరుతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. “కోట బొమ్మాళి సినిమా గురించి చెప్పాలంటే.. ‘లింగిడి లింగిడి’ సాంగ్ ప్రతి ఒక్కరికీ చేరింది అనేది నిజం. ఈ సాంగ్ ప్రతి ఒక్కరి మైండ్లోకి, హార్ట్‌లోకి వెళ్లి కూర్చుంది. కాబట్టి ఈ పాట సినిమాకు అద్భుతమైన ప్లస్. ఒక డైలాగ్, విజువల్స్, పంచ్, టీజర్, ట్రైలర్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక్కడ ట్రైలర్‌తో పని లేకుండా ఈ సాంగ్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. ఇక ‘కోటబొమ్మాళి ప్రచార సభ అని మొదలెట్టిన ఈ ఎలక్షన్లో.. రేపు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కథలో ప్రత్యేకం ఏమిటంటే.. ‘పోలీస్ చేజేస్ పోలీస్’. పోలీసులని పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. ఈ సినిమాలో ఎవరూ హీరోలు లేరు. కథే హీరోగా వెళుతుంటుంది. తప్పకుండా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ “ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ ఛేజింగ్ పోలీస్. ఇప్పుడున్న సిస్టమ్‌లో పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేది చూపించాలనుకున్నాం.
ఒక పొలిటీషియన్ చేతుల్లో పోలీసులు ఎలా కీలుబొమ్మలుగా మారుతున్నారనేది చూపించాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బన్నీ వాస్ , శ్రీకాంత్, ఎస్కెఎన్, సాయి రాజేష్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, నాగేంద్ర కాశీ, రంజిన్ రాజ్, జగదీష్, విజయ్ పాల్గొన్నారు.