రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు. ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ పాట అద్భుతమైన స్పందనతో వైరల్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ ’ఇజ్జత్’ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గురువారం ఇజ్జత్ సాంగ్‌ని లాంచ్ చేయనున్నారు.
సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రోషన్ కనకాల స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్‌ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు మనసుని హత్తుకునే ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ‘బబుల్‌గమ్‘ రూపొందించారు. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సరికొత్త రొమాంటిక్ జర్నీతోప్రేక్షకులని ఆకట్టుకోనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది.