Saturday, April 5, 2025

ఎంఎల్‌ఎ సైదిరెడ్డే కిడ్నాప్ చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్నాకు దిగారు. తమ ప్రతినిధులను కిడ్నాప్ చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఎంఎల్‌ఎ సైదిరెడ్డి కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేయడంతో అతడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిఐ రామలింగారెడ్డి సదరు ఎంఎల్‌ఎకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News