Saturday, November 23, 2024

కేంద్రం అప్పులు 57 శాతం… తెలంగాణ అప్పులు 28 శాతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో వందల లక్షల కోట్లు అప్పులు చేసి కార్పొరేట్లకు అప్పు మాఫీ చేశాడని, కానీ పేదలను పట్టించుకోలేదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి బిజెపినే కారణమని, బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించి కార్మికులను ఆగం చేసిందని చురకలంటించారు. జిడిపిలో కేంద్రం అప్పులు 57 శాతంగా ఉన్నాయని, తెలంగాణ అప్పులు 28 శాతంగా ఉన్నాయని వివరించారు. దేశంలో 22 రాష్ట్రాల కంటే తక్కువ అప్పు తీసుకున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలియజేశారు. రైతులను మోసం చేయడంతో కాంగ్రెస్, బిజెపి దొందూదొందేనని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోటర్లకు మీటర్లు పెట్టని ఒకే ఒక నాయకుడు సిఎం కెసిఆర్ అని హరీష్ రావు ప్రశంసించారు. కెసిఆర్ రైతుల పక్షాల నిలిచారని, కేంద్రం నుంచి రావాల్సిన రూ.25 వేల కోట్లు వదులుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లో మోటర్లకు మీటర్లు ఉన్నాయని చెప్పారు. కెసిఆర్ రైతుల కోసమే ఆలోచించారని, కెసిఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదేనని స్పష్టం చేశారు. దేశం తలసరి ఆదాయం రూ.1.71 లక్షలు కాగా తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.17 లక్షలుగా ఉందని హరీష్ రావు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News