Monday, January 20, 2025

ఇవాళ వరంగల్‌లో పవన్ ఎన్నికల ప్రచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి ప్రచారం ముమ్మరం చేశాయి. ఎనిమిది రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులు, పార్టీ అధినేతలు, ఢిల్లీ నాయకులు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. బిఆర్‌ఎస్ నుంచి సిఎం కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవిత ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, బిజెపి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటనులు చేస్తున్నారు. ఈ ఎన్నికలలో బిజెపి-జనసేన కలిసి పోటీ చేస్తుండడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన పోటీ చేసే ఎనిమిది స్థానాలతో పాటు బిజెపి అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో కూడా ప్రచారం చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. బుధవాంర వరంగల్ వెస్ట్ నియోజకవరగ బిజెపి అభ్యర్థి రావు పద్మకు తరుపున ప్రచారం చేయనున్నారు. వరంగల్ ప్రధాని కూడలీల వద్ద రోడ్డు షో చేపటనున్నారు. ఈ నెల 25 తాండూరు జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్‌పల్లి జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ తరపున పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25న మహేశ్వరం, 26న కామారెడ్డి, 27న మహబూబాబాద్, కరీంనగర్‌లో ప్రధాని మోడీ ప్రచారం చేస్తుండడంతో పవన్ కల్యాన్ ఆ సభలకు హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News