Sunday, November 24, 2024

బౌలర్ ఆ విధంగా చేస్తే ఐదు పరుగులు ఇచ్చినట్టే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వన్డేలు, టి20లకు బౌలర్లు ఎక్కువ సమయం తీసుకుంటుండంతో ఆటగాళ్లకు జరిమానా విధిస్తున్నారు. జరిమానాను జట్లన్నీ తేలికగా తీసుకుంటున్నాయి. బౌలింగ్ చేసినప్పుడు స్లో ఓవర్ రేటు పాల్పడినచో బ్యాటింగ్ చేసే జట్టుకు ఐదు పరుగులు కలుపుతారు. బౌలింగ్ జట్టు ఓవర్ల మధ్య తక్కువ సమయం తీసుకునేందుకు ఈ రూల్ ఐసిసి తీసుకొచ్చింది. బౌలర్ బంతి, బంతికి మధ్య ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే జరిమానా విధిస్తారు. రెండు సార్లు కంటే ఎక్కు వ కంటే సమయం తీసుకుంటే ఐసిసి నిబంధనల ప్రకారం బౌలింగ్ చేసే జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. మ్యాచ్ రసవత్తరంగా మారినప్పుడు కెప్టెన్, బౌలర్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. దీంతో బ్యాటింగ్ చేసే జట్టు అదనంగా ఐదు పరుగులు లభిస్తాయి. ఓవర్ల మధ్య సమయం తనిఖీ చేయడానికి అధికారుల దగ్గర స్టాఫ్ క్లాక్ ఉంటుంది. ఈ రూల్ డిసెంబర్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు ఐసిసి ప్రయోగత్మకంగా అమలు చేస్తుందని ఐసిసి ప్రకటించింది. టెస్టులకు మాత్రం ఈ రూల్ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News