Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి ఓ భూకబ్జాదారుడు: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి ఓ భూకబ్జాదారుడని.. మహబూబ్ నగర్ లోనే అతిపెద్ద భూకబ్జాలకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొడంగల్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు కేసీఆర్ హాజరై ప్రసంగించారు.

రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలే కరెంటు చాలని చెబుతున్నాడని.. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందా? అని ప్రశ్నించారు. 10హెచ్ పి మోటార్లు వాడాలని రేవంత్ రెడ్డి చెబుతున్నాడని..10హెచ్ పి మోటార్లు వాడే స్థోమత రైతులు వద్ద ఉందా? అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు.. ధరణిని రద్దు చేస్తామని అంటున్నారని.. ధరణిని రద్దు చేస్తే రైతుబంధు ఎట్లా వస్తుందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో వస్తుందని.. నమ్మి ఓటేస్తే గోసపడతమని కేసీఆర్ అన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమని చెప్పారు. మూడోసారి కూడా కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి.. బీఆర్ఎస్ పార్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని కేసీఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News